మెట్రో రైళ్ళలో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో పురుషులు తదితరులెవరైనా కూర్చుంటే వారికి కఠిన జరిమానా విధించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ భవన్, రసూల్ పురాలో హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్&టీ ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి రూ 500/- వరకూ జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి మెట్రో బోగీలో ఎల్&టీ వారి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు నిఘా అధికం చేయాలని నిర్ణయించారు. మహిళా ప్రయాణీకులు తమకెదురైన అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ వాట్సప్ నంబరు కేటాయించాలని అధికారులకు ఎన్వీయస్ రెడ్డి సూచించారు. ఈ నిర్ణయాలను త్వరలో అమలుపరుస్తామని ఎల్&టీ అధికారులు హామీ ఇచ్చారు.

Leave a comment