గుజరాత్ లోని సూరత్ సమీప గ్రామాల్లోని పేద మహిళలకు స్వయం ఉపాధి ఏర్పరిచేందుకు శక్తి ఫౌండేషన్ కు రూపకల్పన చేశారు జర్నలిస్ట్ సోనాల్ రోచాని. ఇక్కడ కుటుంబాల్లో చాలామంది మగవాళ్ళు తాగుడుకు బానిసలై మృతిచెందారు. ఒంటరిగా మిగిలిన మహిళలు దుర్భరమైన దరిద్రంలో ఉన్నారు వారికి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు గానూ సోనాల్ రోచాని ఈ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి మహిళలకు అందించారు. ప్రభుత్వ సాయం కూడా అందింది ఆ డబ్బుతో సూరత్ చుట్టుపక్కల యాభై ఐదు గ్రామాలకు చెందిన ఐదు వేల మంది మహిళలు వెదురు బుట్టలు,అప్పడాలు, అగరబత్తులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

Leave a comment