Categories

తన ఇంటి మిద్దె తోటలో 600 రకాల గులాబీలు పూయించి వేల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది అంజు కార్తీక. కేరళ లోని కాయం కులానికి కాయంకుళానికి చెందిన 52 ఏళ్ల అంజు కు పువ్వులంటే చాలా ఇష్టం. 2013లో బ్రెజిల్,థాయిలాండ్ ల్లో పెరిగే టేబుల్ గులాబీ రకాలను తెచ్చి తన ఇంటి టెర్రస్ పైన పెంచడం ప్రారంభించింది. ఆ వాతావరణం లో ఆమె పెంచే గులాబీలన్నీ వికసించాయి. అలా తన సొంతంగా అంటుకట్టి ఎన్నో రంగుల్లో రూపాలలో గులాబీలను సృష్టించింది అంజు. ఫేస్ బుక్ లోనే తన గులాబీ రకాలను అమ్ముతుంది.సరదాగా మొదలుపెట్టిన పని ఇవాళ ఆమెకు ఆదాయం తెచ్చి పెడుతోంది..