63 ఏళ్ళు వచ్చాక సాధారణంగా ఎవరినైనా బామ్మగారు అనేస్తారు కానీ రవి బాల శర్మ డాన్స్ చూస్తే అసలు అలా అనలేరు. బాలీవుడ్ స్టార్ అక్రమ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ నటించిన అత్రంగి రే చిత్రంలో చకా చక్ అనే పాట కు రవి బాల శర్మ చేసిన డాన్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. హీరోయిన్ అలీఖాన్ మాదిరిగానే డాన్స్ ఉందని ఆమె పై ప్రశంసలు కురిశాయి. వయసు పెరిగింది ఇక రిటైర్మెంట్ అనుకొనే ఎంతోమందికి ఈమె రోల్ మోడల్ అనీ, వయసు ఒక నంబర్ మాత్రమే అని.. టాలెంట్ కు వయస్సు కి సంబంధం లేదంటున్నారు నెటిజెన్స్. ఈ డాన్స్ కు లక్షల కొద్దీ లైకులు వచ్చాయి.

Leave a comment