Categories
పల్లెటూరి అమ్మ గా నటించిన 75 ఏళ్ల వయసులో దేశం మొత్తానికి అభిమాన నది అయింది అభా శర్మ. తండ్రి పోయాక తల్లిని చూసుకునే బాధ్యత తీసుకొని అభా వివాహం చేసుకోలేదు.35 ఏళ్లకే ఆమెకు అనారోగ్యం తో పళ్ళు ఊడిపోయాయి శరీర అవయవాలు కంపించే వ్యాధి వచ్చింది. అయినా అభా నాటకాల్లో నటిస్తూనే ఉంది. అమెజాన్ వెబ్ సిరీస్ పంచాయిత్ సీరియల్ లో పల్లెటూరి ముసలమ్మ గా నటించి అందరి అభిమానం సంపాదించింది అభా శర్మ.చిన్నతనం నుంచి నటించాలనే ఒకే ఒక ఆసక్తి పట్టుదల అభా శర్మ కు ఇంత కీర్తి తెచ్చి పెట్టింది.