DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో  వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి  సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ రహస్యం నీళ్లు పళ్ళు కూరగాయలు తినటం ,యోగా  చేయటం ఈమె ఇచ్చే ఒక అపూర్వమైన ఉపదేశం ఏవిటంటే జీవితంలో వచ్చే ప్రతి స్టేజ్ బాల్యం యవ్వనం వార్ధక్యం ఇలా అన్ని మలుపులు మనలోని సౌందర్యాన్ని ఒక్కరకంగా పెంచేస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తం చుట్టిన అనుభవంతో చెపుతున్న నా మనసుని ప్రతి క్షణం నా కాన్ఫిడెన్స్ తో నింపేసుకుంటూ వుంటా. అని చెప్తోంది. నిజం కదా ఈ రంగు మారే ప్రకృతి  ఎప్పుడైనా వృధాప్యంతో బాధపడిందా.. లేదు.. మనం కూడా ఇంతే కాలప్రవాహం తో నడుస్తూ కాలంలోకి జారిపోతాం. మన మనసుకి ముసలి తనం ఏమిటి ?

Leave a comment