ఒక వయసోచ్చాక ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకోవటమే అనుకుంటారు. కానీ వయసు ఒక సంఖ్య మాత్రమే అని రుజువు చేసింది జపాన్ కు  చెందిన తకిమికా అన్న బామ్మ ఆమెకు ఇప్పుడు 90 ఏళ్లు కానీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా తిప్పేస్తూ రకరకాల వ్యాయామాలు చేస్తోంది బోలెడన్ని ఆసనాలు వేయగలదు కూడా. ఏముంది జిమ్ కి వెళ్లే వాళ్లకి ఇదేమంత కష్టం కాదు అనుకుంటాం కానీ 90 ఏళ్ళ వయసులో ఇంత చలాకీగా శరీరాన్ని విల్లులా వంచే వ్యాయామాలు చేయగలగటం గొప్పే కదా ఆమె ఈ వ్యాయామాలను తన 65 ఏళ్ల వయసులో మొదలు పెట్టింది. ఆమె భర్త ఆమె శరీరపు బరువు గురించి ఏదో కామెంట్ చేశారట ఆ జోక్ తకిమికా కు నచ్చలేదు ఎలాగైనా సన్నబడి చూపిస్తా నని  వ్యాయామం మొదలుపెట్టి బరువు తగ్గి పోయిందట. వ్యాయామం పైన ఆమెకు ఇష్టం పెరిగిపోయిందట. అటు సాధన చేస్తూ ఫిట్ నెస్ ట్రైయినర్ గా మారిపోయింది. ఈ కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తోందట. 90  ఏళ్ళయితేనేం ఆమె చేసే వర్క్ వుట్స్ చూస్తుంటే  20 ఏళ్ళ వాళ్ళు కూడా అంత తేలికగా చేయలేరేమో ననిపిస్తుంది కూడా !

Leave a comment