Categories
రకరకాల పదార్ధాలతో ఫ్రిజ్ నింపేస్తాం. ఎదో ఒక కొంచెం మిగిలినా చాలు రేపొద్దున్న చుదోచ్చులే అని లోపల తోసేస్తం అలా ఎన్నో కొన్ని రోజుల తరబడి వుంది పోతు ఉంటాయి. కొన్ని ఫ్రిజ్ లోపల ఎక్కువ కాలం ఏవి ఉంచినా ప్రమాదమే. ఫ్రిజ్ లో రెండు రకాల బాక్టిరియా పెరుగుతుంది. స్పాయిలేజ్ బాక్టిరియా చల్లని ప్రదేశం లో కుడా జీవించి ఆహార పదార్ధాల రుచి మార్చేందుకు. కూరగాయలు వాడిపోయే దాకా అస్సలు ఉంచ కూడదు. ఫ్రిజ్ లో పెరిగే ఇంకో బాక్టిరియా ఫ్యాధోజెనిక్. ఆహారం ఇన్ ఫెక్ట్ అవ్వటానికి కారణం ఇదే. ఈ బాక్టిరియా గుర్తించలేదు పదార్దాల రుచి మారటం పని వుండదు కానీ ఈ బాక్టిరియా ప్రభావం ప్రతి పదార్ధం పైన వుంటుంది.