Categories
ఉజ్మా అహ్మద్ బయోపిక్ తెరకేక్కబోతుంది. ఇందులో ఇలియానా ఉజ్మా గా నటించనుంది. ఉజ్మా సంచలనం సృష్టించిన వార్త అందరికీ గుర్తుండే వుంటుంది. మలేషియాలో పరిచయం అయిన పాకిస్తాన్ పౌరుడు తాహిర్ అలీని ఇష్టపడింది ఉజ్మా. అతన్ని కలిగేందుకు పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడకు వెళ్ళాక తాహిర్ కు అది వరకే పెళ్ళయిందణీ, అతనికి నలుగురు పిల్లలున్నారని తెలిసింది. అయితే ఎలాగోలా ఉజ్మా అహ్మద్ ని పెళ్ళాడేస్తానంటారు తాహిర్. ఎలాగోలా అతని బారి నుంచి బయట పడి భారత హై కమీషన్ ను సంప్రదించి కేంద్ర మంత్రి శుష్మా స్వరాజ్ సహాయంతో ఎలాగోలా ఇండియా చేరుకుంది ఉజ్మా. అయ్ దేవగన్ తో రెడ్ సినిమాలో నటిస్తున్న ఇలియానా ఉజ్మా పాత్రలో నటించేందుకు ఎంతో ఎగ్జయిట్ అయ్యానంటోంది.