Categories
ఇంటి గదులు విలాసవంతంగా అనిపించాలంటే గోడలపైన దృష్టి పెట్టాలి అంటారు ఇంటీరియర్ డిజైనర్స్ ఫ్యాభ్రిక్ ,త్రీడీ బోర్డ్,రకరకాల చిత్రాలతో ,మెటల్ మార్బుల్ పలకలతో గోడల ఉరితలాన్ని కవర్ చేస్తే చక్కని లుక్ వస్తుందంటున్నారు. లైట్లతో కూడా గదులకు లగ్జరీ లుక్ తేవచ్చు. రకరకాల లైట్ల వాడకం గదికి వైవిధ్యం వస్తుంది. అలాగే అందమైన అద్దాలు గదికి చక్కని అందం తీసుకువస్తాయి. అలాగే వాల్ పేపర్లు కూడా గదికి కొత్త అందం తెస్తాయి. ఎల్ సిడి రైఫ్ ఫ్యానల్ ని పై కప్పుగా వాడితే హాల్లో పగటివేళ చక్కని వెలుతురు పరుచుకొని అందంగా కనిపిస్తుంది. కాస్త కొత్తగా ఆలోచిస్తే చాలు చిన్న చిన్న మార్పులతో ఇంటి రూపం మారిపోతుంది.