Categories

బరువు పెరుగుతారన్న కారణంతో పెరుగు తినకుండా ఉండటం కేవలం అపోహే అంటున్నారు నిపుణులు.ఇందులోని పోషకాలు ఎన్నో విధాలుగా మేలు చేయడమే కాక బరువు తగ్గించేందుకు కూడా ఎంతో దోహదం చేస్తాయంటున్నారు. అధిక మోతాదులో కాల్షియం ఉండే పెరుగు నిజంగా సూపర్ ఫుడ్డే అంటారు.పెరుగు తింటే శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో ఇన్ ఫెక్షన్లు అదుపులో ఉంటాయి.దీని వల్ల ఆకలి అదుపులో ఉంటుంది రోజులో కనీసం మూడు చెంచాలు పెరుగు తినడం వల్ల దానిలోని కాల్షియం శరీరంలోని కొవ్వు కణాలను బయటకు పంపిస్తుంది.పెరుగులో అధిక మోతాదులో పోటాషియం ,ఫాస్పరస్,రైబ్ప ఫ్లెవిన్ ,అయోడిన్ ,జింఖ్ విటమిన్ బీ5 ,బీ12 వంటి పోషకాలు కూడా ఉంటాయి.