Categories
ఫ్రెండ్స్ పుట్టిన రోజులు,ఇతర చిన్న వేడుకలకు అటెండ్ అయ్యేందుకు చిన్ని అలంకారణ చిట్కాలు పాటించమంటున్నారు . శరీరం తీరును బట్టి ఎంచుకొనే డ్రస్ ను బట్టి అలంకరించు కొనే నగలుంటాయి . బరువుగా వేలాడే భారీ హ్యాంగింగ్స్ వేడుకల్లో ఆకర్షణగా ఉంటాయి . రాళ్ళు పొదిగిన ఫ్యాన్సీ హేంగింగ్స్ బావుంటాయి . అలాగే నుదుటి పైన పెట్టుకొనే బొట్టు విషయంలో, జుట్టు దువ్వుకొనే విషయంలో కాస్త ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి . శిరోజాలంకరణలో పువ్వులు కుడి గొప్ప అందాన్ని ఇస్తాయి . పువ్వుల పరిమళం తో పాటు చక్కని పెర్ ఫ్యూమ్ కూడా వాడితే బావుంటుంది . రోజూ చేసుకొనే సాధారణ అలంకరణ కాకుండా కాస్త ప్రత్యేకంగా తయారైతే పార్టీ లుక్ తో మెరిసిపోవచ్చు .