ఆఫ్రికా ఖండపు పశ్చిమ దేశమైన ఘన్ అన్న ఉరిలో ఉన్నా లరబాంగా  మసీదు అయిదు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు . ఆ గ్రామంలోని ఆయుబా అనే వ్యాపారి కలలో ఒక మసీదు నిర్మించమనే పిలుపు వినిపించింది . స్థానికంగా ఉన్నా మట్టితో ఈ మసీదు కట్టారు . నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ,మధ్యలో ప్రధాన గృహం ఉంటుంది . ఒక ద్వారం మహిళలకు కేటాయించారు మట్టి కలప దూలాలు ఉపయోగించి నిర్మించిన ఈ మసీదు చెదలు పాడుచేస్తూ ఉంటె ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సాయంచేసి మసీదును యధాతదంగా మార్పులు లేకుండా నిలబెట్టాయి . సాధారణ మసీదులకు బిన్నంగా ఇది మట్టి గోడలతో ఉంటుంది . ఇది ముస్లిమ్ ల పర్యాటక కేంద్రం .

Leave a comment