
కెన్యా లోని మోంబాసా లో నివశించే ఒక తల్లి ఆకలి తో ఏడుస్తున్న తన బిడ్డలను ఓదార్చేందుకు గిన్నెలో రాళ్ళను ఉడికిస్తూ వాళ్ళను నమ్మించబోయింది. పెనికా బహతీ కిట్సావా భర్త బంది పోట్ల తో పోరాడటంలో చనిపోయాడు ఎనిమిది మంది పిల్లలను పెనినా నాలుగిళ్ళలో పని చేస్తూ ఎలాగో పోషిస్తుంది. లాక్ డౌన్ తో పెనినా పని పోయింది. ఆకలికి అలమటిస్తున్న పిల్లల కోసం పెనీనా రాళ్ళు వండటం,పొరుగునే ఉన్న పిస్కా కంట పడింది. పిల్లలు నిద్రపోయేవరకు ఎదోలాగా మరపిద్దాం అనుకొన్నాను అన్నది పెనినా. పిస్కా చదువుకొన్న అమ్మాయి ఈ రాళ్ళ వంట గురించి మీడియాలో అలెర్ట్ చేసింది. కెన్యా లో ఎంతో మంది పెనినా బిడ్డలకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు సోషల్ మీడియా కూడా అద్భుతాలు చేసింది.