Categories
ఎన్నో అనారోగ్యాలకు,అకాల మరణాలకు శారీరక వ్యాయామం లేకపోవటమే కారణం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో గంటల కొద్దీ ఇంట్లోనే పని చేయవలసి వస్తోంది. శరీరాన్ని మనసునీ చురుకుగా ఉంచుకొనేందుకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయచ్చు. మెట్లు ఎక్కి దిగవచ్చు. పని చేసే సమయం మధ్యలో లేచి కాసేపు అటు ఇటు పచార్లు చేయవచ్చు. యోగాసనాలు,బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయవచ్చు. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయవలసి వస్తే అరగంటకో సారి బ్రేక్ తీసుకొని వ్యాయామం చేయాలి. యాక్టివిటీ ఏదైనా సరే అది చక్కని నిద్ర నిచ్చేంతగా ఉండాలి. రోజు ఓ అరగంట శారీరక వ్యాయామం చేయాలి. చురుగ్గ ఉండాలి.