Categories
ప్రకృతి ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంది.హిమాచల్ ప్రదేశ్ లోని కులు కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది మణికరన్ పుణ్యక్షేత్రం పరమశివుడు,గురునానక్ ఒకేచోట కొలువైన చోటు.ఈ మణికరన్ ప్రత్యేకత వేడినీటి బుగ్గలు. చల్లని చలిలో కూడా నీటి బుగ్గలు పొగలు కక్కుతాయి. గురుద్వారా లో ప్రసాదం ఈ నీటి బుగ్గల పైనే వండుతారు.బియ్యం పప్పు ఎసరు పోసి ఈ నీళ్లలో పెడితే ఉడికిపోతాయి. ఇక్కడి నీటి బుగ్గల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని చెబుతారు.ఈ లోయలో జియో థర్మల్ ఎనర్జీ కారణంగా భూమి కింద రాళ్లు వేడెక్కి నీళ్లు వేడిగా వస్తాయని శాస్త్రవేత్తలు అంటారు. కానీ ఇది మాత్రం ప్రకృతి అద్భుతమే అంటారు ఈ నీటి బుగ్గల్లో స్నానం చేసిన వాళ్ళు.