కరోనా పోరులో చిన్నారులు కూడా భాగం పంచుకుంటున్నారు కలకత్తాలోని పార్క్ సర్కస్ అనే మురికివాడలో కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయి.అంతటా లాక్ డౌన్ విధించారు అక్కడకు 14 ఏళ్ల అమ్మాయి ముర్షిదా ఖాటూన్ తన15 మంది మిత్రబృందంతో సహాయ చర్యలు చేపట్టింది.సేవ స్వచ్ఛంద సంస్థ అక్కడి పిల్లలకు విటమిన్ ఎ, పాలు సరఫరా చేస్తుంది ఈ ముర్షిదా ఖాటూన్ బృందమే ఆ మాత్రలు పాలు తల్లిదండ్రులకు అందిస్తోంది. నీళ్లు పట్టుకొనే చోట ఈ పిల్లలే క్యూ లో నిలబడతారు.ఆ ప్రాంత ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారో లేదో చూస్తారు.ప్రతిరోజు మాస్క్ గ్లౌజులు ధరించి ఈ పిల్లల బృందం ఆ లాక్ డౌన్ విధించిన ప్రాంతానికి బయలుదేరి వెళతారు.