Categories
ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళ జీవితం వారి అనుభవం ఎంతో విలువైనవి.కాకపోతే దాన్ని కనిపెట్టవలసిన బాధ్యత మనదే పాబ్లో పికాసో ఒక కాఫీ షాప్ లో కూర్చుని ఉన్నారు ఆయన ను ఒక మహిళ ఒక బొమ్మ వేసి ఇమ్మని కోరింది ఆక్షణాన ఆయన చేతిలో కాన్వాస్ పెయింట్ బ్రష్ ఏమీ లేవు అయినా సరే అడిగింది కదా అని జేబులో ఉన్న పెన్సిల్తో టేబుల్ పైన ఉన్న నాప్కిన్ పైన ఐదు నిమిషాల్లో ఒక పావురం బొమ్మ వేసి ఇచ్చాడు ఆ మహిళ సంతోషపడి ఆ బొమ్మ ధర ఎంత అని అడిగింది. పదివేల డాలర్లు అన్నాడు పికాసో ఆమెకు కోపం వచ్చింది ఐదు నిమిషాల్లో వేసిన బొమ్మ ఖరీదు కోటి రూపాయలు ఎలా అవుతుంది అన్నది పికాసో నవ్వి ఇది గీసేందుకు పట్టిన సమయం 40 సంవత్సరాలు అన్నాడు నేను నలభై ఏళ్ల పాటు కష్టపడితే ఈ నైపుణ్యం నాకు అబ్బింది అందుకే నా కష్టం ధర నలభై సంవత్సరాలు అన్నాడు. జీవితం చాలా గొప్పది పికాసో చెప్పినట్లు దాన్ని అలంకరించేందుకు మనిషి నైపుణ్యాన్ని సంపాదించాలి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి తప్పుల్ని సవరించుకోవాలి మెరుగైన జీవితాన్ని గడపాలి.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134