కరోనా సమయంలో మనుషులకు స్థయిర్యం  ఇచ్చేందుకు గుల్జార్ రాసిన మేరీ పుకార్ సునో పాట ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తోంది.ఎ ఆర్ రెహమాన్ ఈ పాటకు ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీ మణులు అల్కా యాజ్ఞిక్, శ్రేయా ఘోషల్, కేఎస్ చిత్రా, సాధన సర్గమ్, శాషా త్రిపాఠి, అర్మాన్ మలిక్, అసీస్ కౌర్ లు ఈ పాటకు గొంతు ఇచ్చారు.గుల్జార్ రాసిన ఈ పాట చాలా గొప్పగా ఉంది నా నేల మీద ఉండే పిల్లల్లారా నా మాట వినండి, ఇప్పటిదాకా చాలా విన్నారు. ఈ సారి నన్ను వినండి అనే పల్లవితో ఈ పాట మొదలైంది. ఈ పాటంతా భూమి తన పిల్లలతో మాట్లాడుతూ ఉండటం. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉంది.వేదన ఉంది అయినా పర్వాలేదు అందరం ఒకే తాటిపై నడవచ్చు ఒకరికి ఒకరు తోడుగా నిలవడం ధైర్యం తో మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు అంటూ తల్లి భూమి చెపుతున్నట్లు ఉంటుందీ పాట. ఈ కరోనా సమయంలో భయముతో చెదిరిపోతున్న ప్రజలకు ఓదార్పు ఇచ్చేందుకు ఈ పాటని రాశారు గుల్జార్ మనసుకు నెమ్మది నిచ్చే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.

Leave a comment