Categories
1923లో జన్మించింది నాదిన్ గోర్దిమెర్ తల్లిదండ్రులు బ్రిటన్ నుంచి దక్షిణాఫ్రికా కు వలస వచ్చారు.పసితనంలో అనారోగ్య కారణంగా తల్లి నాదిన్ ను చాలా జాగ్రత్తగా ఆమెకు అలసట కలగ నివ్వకుండా పెంచింది. స్కూలు కు కూడా పంపకుండా ఇంటి దగ్గరే ఆమె విద్య బోధన సాగింది.నాదిన్ రచనలకు ప్రేరణ ఆమె బాల్యం నుంచి అనుభవించిన వంటరి తనమే 1945లో జోహన్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య కోసం చేరింది. మండేలా కు భావపరంగా దగ్గరయింది. నాదిన్ రచనలకు మండేలా జైలులో ఉండగానే చదివారు ఆమె పట్ల గౌరవం తో ముందుగా జైలు నుంచి విడుదల కాగానే ఆమెనే చూశారు దక్షిణాఫ్రికా ను ప్రేమించి అక్కడి వర్ణవివక్ష అనే సాహిత్య వస్తువుగా చేసుకొని రచనలు చేసిన నాదిన్ 1991 లో నోబెల్ పురస్కారం పొందింది.