నీహారికా ,అమ్మేపుడూ విసుక్కుంటుంది. ఒక్కోసారి న పైన ప్రేమ లేదేమో అనిపిస్తుంది. ఆవిడ నన్ను ప్రేమిస్తోందా ? లేదా నాకే ప్రేమంటే ఏమిటో తెలియదు అన్నావు నిజమే మనసు నిండా ప్రేమ దాచేసుకుని దాన్నిక్రమశిక్షణ పేరుతోనో లేదా ఇంకేం కారణం వల్లనో వ్యక్తం చేయకుండా మనసులో దాచేస్తే ఫలితం ఉఇలాగే ఉంటుంది. చెప్పి తీరాలి . నువ్వు నాకెంతో అపురూపం అని ఎదిగే పిల్లల మనసులోకి ఎక్కేలా చెప్పాలి. ఒక వయసు పిల్లలకి మంచి గైడెన్స్ కావాలి. మనసు విప్పి చెప్పుకుందుకు వెళ్ళాను విపరీతంగా నమ్మొచ్చు అన్న భరోసా తల్లితండ్రుల దగ్గర నుండి రావాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకి అండగా ఉంటారని తమ ఆసక్తులు ప్రయోజనాలు అనుక్షణం అన్నివేళలా పర్యవేక్షిస్తూ ఉంటారని టీనేజర్లకు తెలిస్తే కదా వాళ్ళకి భద్రతా భావం కలిగేది. పిల్లలు ప్రపంచంలో ఎన్నో రిస్కులు ఎదుర్కోవాలి. ఎన్నో సందేహాలకు వాళ్లకు సమాధానం రావాలి. ఎటువంటి ఆంక్షలు షరతులు లేని స్వేచ్ఛ వాళ్లకు ఇచ్చి మళ్ళీ మేం నీవెనకే వున్నాం నీవు ఈ ప్రపంచంలో వంటరిగా నిలదొక్కుకునేదాకా నీరిక్షణ బాధ్యత మాదనే ధైర్యం పెద్దవాళ్ళు ఇవ్వకపోతే పిల్లలకు ధైర్యం ఆత్మ విశ్వాసం ఎలా వస్తాయి. అలాగే నీహారిక నువ్వు అర్ధం చేసుకోవాలి. నీకోసం నీ తల్లితండ్రి చేస్తున్న ఎన్నో పనుల్లో నీకు అందే ప్రేమను నువ్వు తెలుసుకో ఐలవ్ యు అన్న సందేశం కేవలం మాటల ద్వారానే కాదు. ఎన్నో రకాలుగా వ్యక్తం అవుతూనే ఉంది. అసలు నీకు మొట్టమొదటిగా అందిందే మీ అమ్మ స్పర్శ. ఆవేళ్ళ కోనల్లోంచి నీ బుగ్గ పైకి తాకిన మాతృ స్పర్శ నీకు ఆమె ప్రేమను గుండె మొత్తంగా ఇవ్వలేదా ? అమ్మ నీకు అర్ధం కాలేదా నీహారికా !!
Categories
Nemalika

నీ బుగ్గ తాకిన ఆ స్పర్శ నీకేమిచ్చిందీ

నీహారికా ,

అమ్మేపుడూ విసుక్కుంటుంది. ఒక్కోసారి నా పైన ప్రేమ లేదేమో అనిపిస్తుంది. ఆవిడ నన్ను ప్రేమిస్తోందా ? లేదా నాకే ప్రేమంటే ఏమిటో తెలియదు అన్నావు నిజమే మనసు నిండా ప్రేమ దాచేసుకుని దాన్నిక్రమశిక్షణ పేరుతోనో లేదా ఇంకేం కారణం వల్లనో వ్యక్తం చేయకుండా మనసులో దాచేస్తే ఫలితం ఉఇలాగే ఉంటుంది. చెప్పి తీరాలి . నువ్వు నాకెంతో అపురూపం అని ఎదిగే పిల్లల మనసులోకి ఎక్కేలా చెప్పాలి. ఒక వయసు పిల్లలకి మంచి గైడెన్స్ కావాలి. మనసు విప్పి చెప్పుకుందుకు వెళ్ళాను విపరీతంగా నమ్మొచ్చు అన్న భరోసా తల్లితండ్రుల దగ్గర నుండి రావాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకి అండగా ఉంటారని తమ ఆసక్తులు ప్రయోజనాలు అనుక్షణం అన్నివేళలా పర్యవేక్షిస్తూ ఉంటారని టీనేజర్లకు తెలిస్తే కదా వాళ్ళకి భద్రతా భావం కలిగేది. పిల్లలు ప్రపంచంలో ఎన్నో రిస్కులు ఎదుర్కోవాలి. ఎన్నో సందేహాలకు వాళ్లకు సమాధానం రావాలి. ఎటువంటి ఆంక్షలు షరతులు లేని స్వేచ్ఛ వాళ్లకు ఇచ్చి మళ్ళీ మేం నీవెనకే వున్నాం నీవు ఈ ప్రపంచంలో వంటరిగా నిలదొక్కుకునేదాకా నీరిక్షణ బాధ్యత మాదనే  ధైర్యం పెద్దవాళ్ళు ఇవ్వకపోతే పిల్లలకు ధైర్యం ఆత్మ విశ్వాసం ఎలా వస్తాయి. అలాగే నీహారిక నువ్వు అర్ధం  చేసుకోవాలి. నీకోసం నీ తల్లితండ్రి చేస్తున్న ఎన్నో పనుల్లో నీకు అందే ప్రేమను నువ్వు తెలుసుకో ఐలవ్ యు అన్న సందేశం కేవలం మాటల ద్వారానే కాదు. ఎన్నో రకాలుగా వ్యక్తం అవుతూనే ఉంది. అసలు నీకు మొట్టమొదటిగా అందిందే  మీ అమ్మ స్పర్శ. ఆవేళ్ళ కోనల్లోంచి  నీ బుగ్గ పైకి తాకిన మాతృ స్పర్శ నీకు ఆమె ప్రేమను గుండె   మొత్తంగా ఇవ్వలేదా ? అమ్మ నీకు అర్ధం కాలేదా నీహారికా !!

Leave a comment