తాత తండ్రులు ఆరోగ్య అలవాట్లు పిల్లల ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపెడుతున్నాయి అంటున్నారు అధ్యయనకారులు . వాళ్ళ అలవాటు సవ్యంగా లేకపోతే పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దండగే అంటున్నాయి తాజా అధ్యయనాలు . రెండు తరాల మనుష్యుల పైన దీర్ఘకాలం జరిగిన ఒకఅధ్యయనంలో తొలి తరం తాతల ఎక్కువ తియ్యని పదార్దాలు తినిఉంటే,చిరుతిండ్లు తినే అలవాటు ఉంటే వాళ్ళలో వచ్చే అనారోగ్యాలన్నీ రెండోతరానికి సంక్రమించాయి అందుకే డాక్టర్లు ప్రతిచిన్న అనారోగ్యానికి కుటుంబ చరిత్ర అడుగుతూ ఉంటారు . వాళ్ళ ఆహారపు అలవాట్లు అనారోగ్యాలు వాడిన మందులు తెలుసుకొంటే తర్వాతి తరానికి వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారం తొందరగా వెతకచ్చు నేనే అభిప్రాయంలో కుటుంబ చరిత్ర నమోదు చేస్తారు . తాతలకు డయాబెటిస్ ఉంటే అది మనవడి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందన్నమాట .

Leave a comment