అందమైన ప్రకృతి చుట్టూ నీళ్లు మధ్యలో నివాస గృహాలు ! ఈ ఊహే బాగుంది కదా .అసలు ఒక ఇసుక రేణువు అంతా నేల కూడా అక్కడ లేకుండా కట్టిన ఫ్లోటింగ్ విలేజ్ ‘ko panyi’ ఇది థాయిలాండ్ లో ఉండే సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు సముద్రం మధ్యలో కర్రల సాయంతో ఇల్లు కట్టుకుని చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు .నెమ్మదిగా ఒక్కొళ్ళు చేరుతూ ఇల్లు పక్కన ఇల్లు కట్టుకుని స్థిరపడటంతో ఇప్పటికి  300 ఇళ్ళు 1500 జనాభా తో ఒక పెద్ద గ్రామం అయిపోయింది. మరి అది కాస్తా ఒక ఊరి రూపం తీసుకున్నాక అక్కడ పిల్లల కో స్కూలు ఉండాలి. షాపింగ్ కాంప్లెక్స్ లు సకల సదుపాయాలు ఉండాలి కదా. అట్లా అవన్నీ ఇప్పటికీ ఏర్పడ్డాయి. ఇంకా ఏవైనా కావాలి అనుకుంటే ఊరి ప్రజలు పడవల పైన సాగర తీరానికి వెళ్లిపోయి తెచ్చుకుంటారు. ఇంత అందమైన ఫ్లోటింగ్ విలేజ్ ను చూసేందుకు పర్యాటకులు వస్తూ ఉంటారు. అచ్చంగా కర్రలు స్తంభాలపైన అలల వడిలో తేలుతూ ఉంటే ఈ గ్రామం గొప్ప టూరిస్ట్ అట్రాక్షనై పోయింది నీలి సముద్రం మధ్యలో కొండ దాన్ని ఆనుకుని ఉన్న ఈ అందాల పల్లె మనుషులు సృష్టించిన అద్భుతం   !

Leave a comment