ఎంచుకున్న రంగంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఈ రంగంలో వస్తున్న ఆధునాతన ఆవిష్కరణలను సాంకేతికతను అధ్యయనం చేస్తూ పట్టు పెంచుకున్న అంటారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రత సంచాలకురాలు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖి అధికారి జి.విజయలక్ష్మి. దేశంలోనే ఈ పదవి నిర్వహిస్తున్న ఏకైక మహిళా అధికారి ఆమె 30 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ లో అడుగుపెట్టి ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఎంచుకున్నాను పరిశ్రమలు, ఫ్యాక్టరీ లు, సినిమా హాళ్లు, ఆస్పత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో నూ, ప్రముఖులు పాల్గొనే వేదికలు సభ ప్రాంగణాల్లో విద్యుత్ భద్రతా చర్యలను పరిశీలించి నివేదిక ఇవ్వాలి. నా పని అంటారు విజయలక్ష్మి.