ప్రపంచానికి మనపైన అంచనాలు ఎక్కువే . అటు చూపిస్తాయి మరుక్షణం విమర్శస్తాయి . నా విషయంలో ఇది కాస్తా ఎక్కువే . మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకొంటానని . నేను మానసిక రోగినని బాహాటంగా విమర్శించారు . ఆ దశను నేను మరచి పోలేదు . అస్సలు నాకు అనారోగ్యము ,వైద్యము రెండు అనుభవంలో లేవు . కానీ నేను ఈ విమర్శకు గురయ్యాను అంటుంది కంగనా రనౌత్ . కానీ నేను నా అభిమానులకు థాంక్ ఫుల్ గా ఉంటాను . ఇల్లు వదిలి బాలీవూడ్ చేరుకొన్న సమయంలో నాలో ఉన్నది నా ఆత్మవిశ్వాసం మాత్రమే . మనుషులను నమ్మటం నా స్వభావం ఇదే లేకుంటే జీవితం ఏనాడో ముగిసి పోయేది అంటుంది కంగనా. ఆత్మ స్థయిర్యం ,నమ్మకం తనకు తోడుగా ఉన్నాయంటుంది కంగనా .

Leave a comment