కరోనా భయంతో చేతులు శుభ్రం చేసుకోవటం శానిటైజర్ రాసుకోవటం చేస్తున్నారు.ఈ శానిటైజర్ మంచిదా నాసిరకమా నకలీ నా తెలుసుకునేందుకు ఒక చిన్న పరీక్ష చేయొచ్చు.ప్లేట్ లో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని అందులో ఓ స్పూన్ వేసి ముద్ద చేస్తే,అది ముద్దగా అయితే శానిటైజర్ నాణ్యత లేనిదిగా భావించవచ్చు.శానిటైజర్ లో ఆల్కహాల్ 60 శాతానికి కన్నా తక్కువ ఉంటే ఈ టెస్ట్ లో తేలిపోతుంది.ముద్ద చేసిన పిండి లో ఆల్కహాల్ కొన్ని నిమిషాల్లో ఆవిరై,పొడి పిండి ప్లేట్ లో మిగులుతోంది అలా పొడి పిండి మిగిలితే శానిటైజర్ నాణ్యత ఉన్నట్లే.

Leave a comment