నా జీవితంలో సినిమాలు ఒక్కటే కాదు ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ఇష్టమైన పని చేసేటప్పుడు మనసు ఆనందంతో నిండిపోతుంది. నాకు నచ్చిన పాత్రాలు వేసేటప్పుడు మనసులో కలిగిన సంతోషం నా ముఖంపై అందరూ చూస్తారు. నా కళ్ళలో ఉండే మెరుపు నా సంతోషం. అది సహజంగా నా మనసులో నుంచి వస్తుంది.  అందులో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది అంటుంది నిత్యామీనన్. రెండు నెలల విరామం తర్వాత గీతాగోవిందం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది నిత్యామీనన్. ఇక రాబోయే రోజుల్లో మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేయాలనుకుంటున్నా అందులో నేను పాడతా,గిటార్ బాగా వాయిస్తా.  నాకు మ్యూజిక్ ట్రూప్ ఉంది. దీన్ని గురించి ఏదైన చేయాలని చాలా ఉత్సహంగా ఉన్నా రెండు మూడు సినిమాల్లో  కూడా కనిపిస్తా అంటుంది నిత్యామీనన్.

Leave a comment