ఒక పద్ధతి ప్రకారం చర్మ రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మొహం కళకళలాడుతుంది అంటారు ఎక్స్పర్ట్స్.రోజుకు నాలుగు సార్లయినా నాణ్యమైన ఫేస్ వాష్ తో, లేదా పెసర పిండి, పాలు మిశ్రమం తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి రోజ్ బాత్ సాల్ట్ తో ముఖంపై మృదువుగా మసాజ్ చేస్తే మృతకణాలు పోతాయి. తరువాత చల్లని నీళ్లలతో కడిగేయాలి.దీని వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నీళ్ళలో గుప్పేడు తులసి ఆకులు ఒక చుక్క లావెండర్ నూనె వేసి మరిగించి ఆ నీళ్లతో ఆవిరి పట్టాలి. చర్మ రంధ్రాలు శుభ్రపడి మొటిమలు రాకుండా ఉంటాయి. కనీసం ఒక రోజైన ముఖానికి ఎలాటి మేకప్ లేకుండా అలా ఉంచాలి. ఒక నెల రోజుల్లో కోరుకున్న మార్పు కనిపిస్తుంది.

Leave a comment