పవిత్రమైన పూజగదిని అందంగా అలంకరించుకోవడం భక్తులకు ఎప్పుడూ ఇష్టం. అక్కడే ఉండే ప్రతి వస్తువు అందంగా ఉండాలనుకొంటారు . హారతి పళ్లేలు కుంకుమ భరణి లు ఎన్నో డిజైన్ల లో వచ్చేశాయి .ఇప్పుడు అగరబత్తి స్టాండ్ లు కూడా రకరకాలు డిజైన్ లలో అందుబాటులోకి వచ్చేసాయి. చూసేందుకు అమ్మాయిల మెడలో పెండెంట్స్ లాగా భగవంతుని ప్రతిమ లాగా కనిపించే ఫినిషింగ్ స్టాండ్లు దొరుకుతున్నాయి. ముందు వైపు చిన్న విగ్రహం అందమైన ప్రతిమ ఉన్నట్లు కనిపించే వీటికి వెనకవైపు అగరోత్తులు గుచ్చేందుకు గొట్టాలు ఉంటాయి. ఎక్కువగా లక్ష్మీదేవి వినాయకుడు వెంకటేశ్వరస్వామి ఆకృతుల్లో కనిపిస్తున్నాయి .ఏనుగు నెమలి వంటి చిన్న రూపాల్లో ఎంతో స్పెషల్ గా ఉన్నాయి. లోహంతో చేసినవి కొన్నైతే ఎరుపు పచ్చ రాళ్లు పొదిగినవి ముత్యాలు జత చేసినవి ఉన్నాయి. మ్యాట్ ఫినిషింగ్ వల్ల వచ్చే యాంటిక్ లుక్ వాటికి మరింత అందం తెచ్చిపెట్టాయి.గోల్డ్ కవరింగ్ లో దొరికే ఒక స్టాండ్ తెచ్చి పెట్టుకుంటే సువాసనకోసం అగరోత్తులు వెలిగించి టీపాయ్ పైన పెట్టుకుంటే అదో ఆర్ట్ పీస్ లా అందంగా ఉంటుంది .బంగారపు మెరుపు చక్కని ఆకృతులు అందంగా పొదిగిన రాళ్లు చూడగానే ఇవి బంగారు నగలకు వేలాడే పెండెంట్లు లాగా ఉన్నాయి, కానీ ఇవి భగవంతుడి ఆరాధనకు శోభ తెచ్చే అందాల అగరబత్తి స్టాండ్లు .
Categories