మనదేశంలో ఉన్న మ్యూజియంలలో నవరత్న నగలకు సంబంధించింది రాజస్థాన్ లోని జైపూర్ లో మాత్రమే ఉంది . ఆనాటి రాజపుత్రులు ధరించిన అందమైన నగలు,చక్కని డిజైన్ల తో విలువైన రాళ్ళు పొదిగిన కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. పచ్చలు,కెంపులు,నీలాలు ,వజ్రాలు,మరకతాలు ,ముత్యాలు పగడాలు వంటి నవరత్నాల నగలు వివిధ సైజుల్లో ఇక్కడే కనిపిస్తాయి . వెండి,రాతి నగలు కుందన్ మీనాకారి వంటి ప్రత్యేక విభాగాలున్నాయి . చర్మం తో గడ్డితో ,గవ్వలతో మట్టితో చేసిన ప్రాచీన కాలపు నగలు,వాటి వివరాలు అన్ని చూడచ్చు . ఈ మధ్యకాలంలో వచ్చిన చారిత్రాత్మక సినిమాల్లో కనిపించే నగలన్నీ ఇక్కడ డిజైన్ ల నుంచి తీసుకొన్నవే . ఆభరణాలు ఇష్టపడే అమ్మాయిలు తప్పకుండా చూడండి .

Leave a comment