సంగీతం ఇష్ట పడని వాళ్ళు ఉండరు . ఇప్పుడు ఎన్నో అనారోగ్యాలను మ్యూజిక్ ధెరపీ తో నయం చేస్తున్నారు. అయితే ఈ సంగీతం ప్రభావం వయసుని బట్టి మారుతోంది. అందరికి ఒకే రకమైన సంగీతం వినిపిస్తే కుదరదు ఏ తరం వారికీ ఆ తరం పాటలు ఇష్టం పదిహేనేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ మధ్య కాలంలో ఎలాటి సంగీతాన్ని విన్నారో,సినిమా పాటలు గాయకుడి సంగీతాన్ని ఇష్టపడ్డారో ఆ పాటల ప్రభావమే మనసుపైన ఉంటుందట . పాత తరం వారికీ ఈ తరం పాటలు నచ్చవు వాయిద్యాలు గోలగా సాహిత్యం లేనిదిగా అనిపిస్తుంది సరైన వయసులో ఎన్నో పాటలు మనసులో స్థిరంగా ఉంటాయి ఆ పాటలే వినిపిస్తే ఒక్క సారి మనస్సు వెనక్కు వెళుతోంది వయసు తగ్గిన మానసిక భావన అనారోగ్యాన్ని తగ్గిస్తుంది ఇదే సంగీత చికిత్స వెనక వున్నా మర్మం.

Leave a comment