ఎన్ని ఫ్యాషన్స్ వచ్చిన చీరె కట్టుకే మొదటి ఓటు పడుతుంది. ఏ శైలితో కట్టుకున్న చీరె అందమే అందం. ప్రింటెడ్ లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సారీ చాలా బావుంటాయి. రాచరికపు కళ రావాలంటే చీరె కు జతగా కంచి లేదా బెనారస్ దుపట్టా వేస్తే ఆడంబరంగా అందంగా ఉంటుంది. సాంప్రదాయ లక్నో డ్రెస్ ని ఒకే రంగులో కడితే షరారా  శారీ  అయిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ డబుల్ శారీ స్టయిలే   రెండు రకాల చీరెలు, చందేరి, లేదా పట్టు చీరెలు ఎంచుకుని ఒక రంగు చీరె ఒకవైపు కుచ్చిళ్లు పెట్టుకుని మరోవైపు ఇంకో చీరెతో కుచ్చిళ్లు పెట్టుకుని భుజంపైన పయట కొంగు వేసే చాలు ఈ శారీ స్టయిల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

Leave a comment