పుచ్చపండు తినేసి గింజలు ఊసేస్తామా లేదా,చాలా తప్పు చేస్తున్నారు అంటున్నారు అధ్యయన కారులు. ఆ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఓ కప్పు ఎండిన గింజల్లో 30.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందనీ మనకు రోజుకు అవసరం అయ్యో ప్రోటీన్ లో అది 61 శాతంగా ఉంటుందని చెపుతున్నారు .ఇంక పోషకం ఆర్గనైస్. ఇది రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. మెగ్నిషియం కప్పుల గింజల్లో 556మిల్లీ గ్రాములుంటుంది.మనం తినే కార్బోహైడ్రేడ్స్ వంటికి పట్టేలా చూస్తుంది. ఇక ఐరన్ ,ఫాస్పరస్,సోడియం కాపర్, మాంగనీస్,జింక్ వంటి అనేక ఖనిజాలు పుచ్చకాయ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. శరీర జీవక్రియలకు అవసరమైన శక్తి వనరు బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది .గింజలు పారేయకండి..

Leave a comment