నీహారికా,
మీ వదిన సమస్య చెప్పావు. ప్రతి వాతావరణంలోనూ షాపింగ్ కు వెళ్ళడం ఎదో ఒకటి కొనడం అలమరలో నింపేస్తుంది. ఇదేమైనా జబ్బా, మనసిక వైద్యుడి సలహా తీసుకోవాలా? ఈ షాపింగ్ వీక్నెస్ ఏమిటి అని అడిగావు. నిజమే ఇది షాప్ హాలిక్. తప్పనిసరిగా వదిలించుకోవలసిన జాడ్యం కాకపోయినా కొంత నియంత్రణ కావాలి. ఆమె షాపింగ్ కు అడిక్ట్ అయిపోయివుంటుంది. సాధారణంగా షాపింగ్ అందరికీ ఇష్టం ఇందులో ఆనందం ఉంది. అలాగే ఒక సమస్య ఏమిటంటే ముఖ్యంగా జీవితంలో ఏదైనా కోల్పోయిన వాళ్ళు, ఆనందం అన్నది ఎటుచూసినా అందకపోతే ఇతరత్రా మనసు తృప్తి పరచుకొనే మార్గాల్లో ఇదొకటి. కానీ ఈ అలవాటు మాత్రం ఖరీదైనది. ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తే పర్వాలేదు కానీ అందుబాటులో ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు గీకేస్తే తర్వత ఇబ్బందులు తప్పవు. కనుక వదిన సమస్యకు పరిష్కారం కేవలం విండో షాపింగ్ వరకే సరదాను పరిమితం చేసుకోమని తక్కువగా పర్చేజ్ చేయమని చెప్పటం బెస్ట్. కానీ ఇది ఎవరికీ వారు తమ ప్రాబ్లం గుర్తించు కొని పరిష్కారం చేయవలసిందే. సమస్య కుటుంబ వాతావరణాన్ని, శాంతిని భగ్నం చేసే వరకు పోకుండా చూసుకోవాలి మరి.