చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ  అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా  పాత్రలన్నీ విమర్శకుల మెప్పు పొందినవే. అంటుంది కాజల్. ప్రతి కథనీ ప్రతి పాత్రనీ ఛాలెంజింగ్ గా తీసుకుని హార్డ్ వర్క్ చేస్తాను లేడీ  ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ వుంది. యాక్షన్ మూవీ అయితే మాత్రం నాకు పండగే. కాకపోతే డైరెక్టర్ ను ఫాలో అవటం నాకు అలవాటు. మంచి ఐడియా లు వస్తే ఆయనతో చెప్పటం వరకే నా పని. అంతే గాని నా పాత్ర గురించి ఫలానా రకంగానే వుండాలనే  పట్టింపులు ఎప్పుడూ లేదు. పైగా సినిమాల్లో నటించటం రన్నింగ్ రేస్ కాదు. వెనకా ముందు అవటానికి. నా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నేను మిస్ అవను . నా శక్తీ మేరకు నేను నటించగలను . ఛాలెంజింగ్ తీసుకుని హోమ్ వర్క్ చేసి మరీ పర్ఫెక్షన్ సాధించాలనుకుంటాను. ఇప్పుడు వస్తున్నా ఖైదీ నెంబర్ 150 పైన నాకెంతో నమ్మకం చిరంజీవి గారితో అవకాశం రావటం. ముఖ్యంగా ఓ పాటలో నా కాస్ట్యూమ్ అయితే ఇంతవరకు నేనెప్పుడూ అంత డిఫెరెంట్ గా లేనంటోంది.

Leave a comment