హీరోల పేర్లు చూసి సినిమాలకు క్రేజ్ పెరుగుతుందనీ అసలు హీరోల వల్లే బ్లాక్ బస్టర్లు అవుతాయని సాధారణంగా సినిమా వార్తలు చూస్తుంటాం. ఇప్పుడు అంత క్రేజ్ హీరోయిన్  తమన్నా ఐటెం సాంగ్ కు ఉందిట. ఈమె హీరోయిన్ గా  నటిస్తే ప్రేక్షకులు ఆనందిస్తారనుకుంటే ఆడో కధ. ఇప్పుడు ఆమె ఐటెం సాంగ్  ఉన్నా చాలు ఆ సినిమాకు కనకవర్షం కురుస్తుందిట. హీరో విశాల్ నటించిన ఒక్కడున్నాడు సినిమాకు అదనపు ఆకర్షణ కోసం తమన్నా తో ఐటెం సాంగ్  చేయించారు. ఆ టీజర్ విడుదల చేస్తే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందట. దానితో తమన్నా ఫొటోలున్న పోస్టర్లను రెండు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేసి సినిమా ప్రమోషన్ కోసం వాడారట. ఈ నెల రాబోతున్న ఈ సినిమాకు తమన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అన్నమాట. హీరోయిన్లేమి తక్కువ తిన్లేదండీ !

Leave a comment