ముగ్గులతో వుడెన్ ఫర్నిచర్ ను అద్భుతంగా అలంకరిస్తారు దీపికా వేల్ మురుగన్ కళాత్మకంగా కనిపించే రంగవల్లులను కార్నర్ స్టాండ్ సెంటర్ టేబుల్స్ వుడెన్ స్టూళ్ళు పైన వేసి మార్కెట్ చేస్తున్నారు. ప్రతి వస్తువు కి ముగ్గు తోనే ఒక కొత్త రూపం తెచ్చారామే. ఇంటి ముందు బియ్యం పిండితో వేసే ముగ్గునే అక్రిలిక్ పెయింట్ తో చక్కగా వేస్తారు. దీపికా వేల్ మురుగన్ కాస్ట్యూమ్ డిజైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి తిరువూరు టెక్స్ టైల్స్ లో గార్మెంట్స్ డిజైన్ చేశారామె. సెంటర్ టేబుల్ పైన పెయింట్ తో వేసిన ముగ్గు ని ఇన్ స్టా లో పెడితే ఎంతో రెస్పాన్స్ వచ్చింది. అలాంటి అందమైన టేబుళ్లు వుడెన్ ఫర్నిచర్ చేసి ఇవ్వమని ఎన్నో ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆమె వ్యాపారం ఆన్ లైన్ లో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

Leave a comment