పుస్తకం హస్త భూషణం అంటుంటారు కానీ చేతిలో పుస్తకం ఉంటె విజ్ఞాన ప్రపంచం మన ముందున్నట్లే. అందుకే నా సహవాసం పుస్తకాలతోనే అంటోంది నిత్యా మీనన్. తెలుగు సినీ ప్రపంచంలో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది నిత్యా . ప్రతి సినిమాలో ఆచి తూచి ఎంచుకుంటుంది . ఏదైనా పొరపాట్లు జరిగితే ఒకవేళ తప్పు తనదైతే హాయిగా వప్పుకుంటుంది. ఎంత బోల్డ్ గా మాట్లాడే నిత్యా త్వరలో దర్శకత్వం చేస్తానంటోంది . నేనో పుస్తకాల పురుగుని. ప్రతి రోజు ఎదో ఒక పుస్తకం చదవాల్సిందే. లేదంటే నిద్రపట్టదు. అన్ని రకాల పుస్తకాలు చదువుతా. ఫిక్షన్ అంటే ఎంతో ఇష్టం ఆటోబయోగ్రఫీ అస్సలు వదలను . అందులో ఎదో స్ఫూర్తి నిచ్ఛే అంశాలుంటాయి. ఈ మధ్య ఒక జీవిత కధ చదివా. అది ఓ గ్రామానికి సంబంధించిన కధ. చదువుతున్నంతసేపు ఇంకో ప్రపంచంలో ఉన్నట్లుంది. ఆ కధ ని తెరపై చూపించాలని ఆలోచిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కళ్లముందుంది. ఎప్పుడైన దర్శకత్వం వహిస్తే ముందు ఈ కథే తీస్తానంటోంది నిత్య. అంటే బహుశా తొందరలో డైరెక్టర్ గా మన ముందుకు రాబోతోంది నిత్య.
Categories
Gagana

ఆ జీవిత కధని తెరకెక్కించాలని ఉంది.

Leave a comment