సినిమా హీరోయిన్లను ఇంటర్యూల్లో విసుగులేకుండా అడిగే ప్రశ్న ఒక్కటే మీ కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు. అని వాళ్ళు ఏదో ఒక లిస్ట్ చెబుతారు. కాని కంగనా రనౌత్ మాత్రం ఒకే ఒక్క లక్షణం చాలు అంటుంది. తనకు కాబోయే భర్త దేశ భక్తుడై ఉంటే చాలంటుంది కంగనా. ఎందుకంటే కన్న తల్లి కన్న భూమి ఒక్కటే.  మాతృ భూమిని ప్రేమించలేని వాడు నాతో మాత్రం అంత విశ్వాసంగా ఎలా ఉంటాడు. ఒక వేళ నేను ఎవరినైన ప్రేమించిన ఆ వ్యక్తి దేశ భక్తుడు కాదనుకోండి వెంటనే బ్రేకప్ చెప్పేస్తా. నా కాబోయే భర్త నన్ను ప్రేమించాలి అలగా దేశాన్ని కూడా అంటుంది కంగనా రనౌత్.

Leave a comment