ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీరను కొంటాం ఒక్క సారి ఏ పెరున్న వాషింగ్ కు లాండ్రీకి ఇచ్చినా మొత్తం రంగులు ఏకమై గుర్తు పట్టనట్లు తిరిగొస్తుంది. అల్లాంటి సమస్య గురించి ఆలోచన వస్తే కాస్త జాగ్రత్తగా ఇంట్లోనే వుతుక్కోవచ్చు ఈ చీరను. చీర మెయిన్ కలర్ పట్ల కాంట్రాస్ట్ కలర్స్ అయితే వుతికేటప్పుడు మొత్తం చీరను ఒకే సారి నీళ్ళల్లో మున్చాకూడదు. అంచు వరకు ముందుగా కుచ్చుళ్ళు పోసి దారంతో ముడేసి అంత వరకు వుతికేయాలి. అటు తర్వాత పల్లుని ఉతకాలి. చివరగా పట్టు చీర బాడీ ని జాగ్రత్త గా పల్లుకి, అంచుకి తగలనివ్వకుండా ఆరేయాలి ఆరేసేటప్పుడు మడతలు ఒక్కదాని పై ఒక్కటి తాకి అతుక్కునేలా ఆరవేయ కూడదు. పొడవుగా క్లిప్పులు పెడుతూ నేరుగా ఎండ తగలకుండా కాస్త నెడ పడే చూట ఆరవేయాలి. బ్రష్ తో రుద్ద కుండా మెలికలు తిప్పి పిండ కుండా చేత్తో నొక్కుతూ నీళ్ళు పోగొట్టి ఆరవేయాలి.

Leave a comment