కొన్ని దేశాల్లో జనాభా మిగతా వాళ్ళకంటే ఎంతో ఆనందం గా ఆరోగ్యాంగా ఉన్నారని తాజా గా ఫోర్డ్స్ పత్రిక వెల్లడించింది . ఫిన్ లాండ్ ,నార్వే ,స్వీడన్ ,డెన్మార్క్ ,ఐస్ లాండ్ దేశాల్లో ఆదాయం విషయంలో కంటే ఆరోగ్యం విషయంలో ముందున్నాయట . డైయిరి ఉత్పత్తులు ,బ్రెడ్డు ,చేపలు చెర్రీలు ,ఆపిల్స్ ,క్యాబేజి ,దుంప కూరలు ఫోర్క్ వంటివి ప్రజలు నిత్యం తింటారు . కొవ్వులున్న ఆహారం పక్కన పెట్టారు . వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . ఎక్కువగా ప్రకృతిలో గడుపుతారు . ఆరోగ్యం విషయంలో ,ప్రజలు ప్రభుత్వం కూడా బాద్యతగా ఉంటాయి . కానీ ఆ దేశాల్లో ప్రకృతిని కాపాడుకొనే విషయంలో ప్రజలు ముందుంటారు . చక్కని పచ్చని వాతావరణాన్ని సృష్టించు కొట్టారు కూడా అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటొంది  ఫోర్బ్స్ పత్రిక.

Leave a comment