శరీరంలో కలిగే చిన్న అసౌకర్యానికి మందుల వాడకం మంచిది కాదు. కోపం,చిరాకు కలుగుతూ మానసిక స్థితిగతులు గంధరగోళ పెడుతూ ఉంటే ఆ సమస్యలు ఆహారంతో పరిష్కరించవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చి కూరగాయలు,పండ్లు,క్యారెట్స్ మొదలైనవి ఒత్తిడి తగ్గిస్తాయి. మానసిక ఆరోగ్యం అందించటంలో అరటిపండ్లు తిరుగు లేకుండా పనిచేస్తాయి. వీటిలోని పోటాషియం మెదడు పని తీరు పై ప్రభవాన్ని చూపెడుతుంది. యాపిల్ ను పై చర్మం తో సహా తినాలి. మెదడు లో హానికరమైన ఆక్సిజన్ తో కూడిన రసాయనిక కారకాలను యాపిల్ తగ్గిస్తుంది. యాపిల్ జ్యూస్ తక్షణ పరిష్కారం. పాలకూర మానసిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది.

Leave a comment