అన్‌నోన్‌ 16 కు శ్రీకారం చుట్టింది ఆరుషి అగర్వాల్.ఆమె సొంత రాష్ట్రం హరియాణా, తర్వాత బెంగుళూరు లో చదువుకుంది ప్రస్తుతం న్యూజెర్సీలోని వెస్ట్ విండ్సర్-ప్లెయిన్స్ బోరో హై స్కూల్ లో 11  తరగతి చదువుతోంది.రోబోటిక్స్ లో నైపుణ్యం సంపాదించింది అమెరికాలో చదువుకుంటూ వారాంతాల్లో బీహార్ లోని పేద పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు చెబుతోంది పాఠ్యాంశాలు, నైపుణ్య శిక్షణ లకు సంబంధించిన ప్రోగ్రామింగ్ అభివృద్ధి చేసింది.వాటిని ఎన్జీవోలకు అందిస్తుంది బీహార్ లోని  ‘లహంతి క్లబ్‌’  ప్రతినిధుల వారి ఎన్జీవో లోని పిల్లలకు ఇంగ్లీష్ భాష నేర్పమని అడిగారు అలా పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు చెబుతోంది ఆరుషి. బిహార్‌లోని నయాది, కుంబాది, గోవింద్‌పూర్‌, జబర్దా తదితర గ్రామాల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి పిల్లలకు ప్రతి వారం పాఠాలు చెబుతోంది.300 మంది పిల్లలు ఆరుషి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.

Leave a comment