ఫిన్లాండ్,జపాన్ మొదలైన దేశాల్లో చదువు పిల్లలపైన మోయలేని భారం లాగా ఉండదు. కానీ మన దేశంలో రాత్రి నిద్ర వేళలు తప్ప పిల్లలు చదువుకునే వేళలే అన్ని. స్కూల్ ,హోంవర్క్ ట్యూషన్ అంత ఆటలకు పది నిమిషాలు కూడా లేనట్లే . చదువులతో వాళ్లలో ఒత్తిడి మాటేమిటి? కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్స్ వాళ్లకు ఇతర వ్యాపకాలకు టైం ఇవ్వమంటున్నారు. వాళ్లకు ఇష్టమైన అంశంలో తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలంటున్నారు. హోం వర్క్ ఒకసారి గంటలతరబడి కాకుండా విరామం ఇస్తూ చేయించమంటున్నారు. కథలు చెప్పండి ,వాళ్లతో మాట్లాడండి,కొంత సమయం పిల్లలకోసం కేటాయించండి అంటున్నారు. వాళ్ళకు టైం టేబుల్ పెట్టి చదువుతో పాటు ఆటపాటలు వ్యాయామం మొదలైనవి ఉండేలా చూస్తే పిల్లలకు కాస్త రిలీఫ్ దోరుకుతుంది.

Leave a comment