ఎంత డబ్బు ఇచ్చినా వ్యాపార ప్రకటనలు చేయ నంటోంది తాప్సి. నచ్చని పని నా చేత చేయించలేరు. మద్యని సంబందించిన ప్రకటణలో నన్ను నటించమంటే వద్దన్నాను. మద్యం చేసే హాని, దాన్ని ప్రోత్సహించడం నాకు నచ్చలేదు. అలాగే ఫెయిర్ నెస్ యాడ్ కుడా. ఫెయిర్ నెస్ క్రీములతో తెల్లగా అయిపోతారాణి చెప్పాలి. అందులో నిజముండదని నాకు తెలుసు. అబద్దాలు చెప్పి కొనుగోలు దారుల్ని మోసం చేయడం నాకు నచ్చలేదు. ఇలా అంటే నేను డబ్బుకోసం సినిమాలు చేయడం లేదా అంటారు. కానీ నటించడం నేను నటించే వేషంతోనో, నేరుగా నేను మోసం చేయటమో వుండదు కనుక నటిస్తాను అంటోంది తప్సీ పన్ను. డబ్బు కు చేతులు అడ్డు పెట్టి వద్దతానికి కుడా చాలా ధైర్యం కావాలి మరి. తప్సీ కి లాగా ఎందరు ఆలోచిస్తున్నారు.

Leave a comment