ఎన్నెన్నో  సమస్యలకు అబద్దాలేములం. చిన్ని  అబద్దం చెప్పితే దాబ్బి కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడవలిసి వస్తుంది. పైగా పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులనే అనుకరిస్తారు. చాలా పరిస్తుతుల్లో కొన్ని ఇబ్బందులు తప్పించుకునేందుకు పెద్దవాళ్ళు చిన్న చిన్న  అబద్దాలు అడతారు. తాము చేసె పని తప్పయినా, తప్పు   ఎందుకు గానూ చేస్తున్నారో పెద్దవాళ్ళు   విచక్షణతో అలోచించుకుంటారు. చూసే పిల్లలకు ఆ శక్తి వుండదు. అబద్దాలు చెప్పడం వాళ్ళు  నేర్చుకుంటారు. పైగా అది పెద్ద తప్పు  కాదనుకుంటారు. బయట నుంచి ఏదైనా పిల్లల విషయంలో కంప్లైంట్ వస్తే అప్పుడు పెద్దవాళ్ళు   అయ్యే వరకు అబద్దం ఆడటం అవమానకరమైన విషయం అని వాళ్ళకు తెలియదు. లేదా అలవాటైతే అబద్దాల కోరుల్లాగే మిగిలిపోతారు. అందుకే అస్సలు పెద్దవాళ్ళు అబద్దాలు ఆడకపోవడం బెస్ట్ కదా.

 

Leave a comment