ఈ ప్రపంచంలోకి ఎందుకొచ్చాం? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితానికి సార్ధకత ఏమిటని ప్రతి వాళ్ళ ముందుకి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఆత్మ ప్రభోదాలను పట్టించుకోము కానీ తమిళనాడు  మదురై కి చెందిన నారాయణ్ కృష్ణన్ తన జీవిత సార్ధకతని నిర్ణయించుకున్నాడు. ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్. ఇరవై ఏళ్లకే స్విట్జర్లాండ్ లోని పెద్ద హోటల్లో లక్షల రూపాయిలు జీతం తో ఇంకో ఉద్యోగం ఎదురుగా వుంది. ఆకలితో అలమటించే మానసిక వికలాంగులు, అనాధల ఆకలి తిర్చాలనుకున్నాడు. ఉద్యోగం, డబ్బు, కెరీర్ అన్ని వదులుకుని అక్షయ ట్రస్ట్ అనే స్వచ్చంధను ఏర్పాటు చేసారు. రోడ్ల పైన తిరుగుతూ, జుట్టు పెరిగి, గడ్డాలు మాసి మురిగ్గా వుండే వాళ్ళకు క్షవరం చేయించి, స్నానం చేయించి బట్టలు తొడుగుతారు కృష్ణన్ బృందం. కృష్ణన్ లా జీవితం మొత్తం అంకితం చేస్తే సాయానికి చేతులు రాకుండా వుంటాయా? ఎంతోమంది మున్చుకోచ్చారు మదురైలో హోమ్ నిర్మించారు. అయినా ఇప్పటికి కృష్ణన్ రోడ్ల వెంట అనాధల గురించి ప్రతీ క్షణం వెతుకుతూనే వుంటాడు. ఒక స్ఫూర్తి వస్తుంది కదా అని ఈ కధనం వివేరాలకు వెబ్ సైట్ చూడండి.

Leave a comment