వాయు కాలుష్యంలో వచ్చే జబ్బులకు తోడు ఇప్పుడు కొత్తగా ఈ కాలుష్యం కారణంగా అబార్షాన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వాహనాలు వెదజల్లే కాలుష్ష్యం గర్భస్థ శిశువు పై కూడా తీవ్ర ప్రభావం చూపెడుతుందని అబార్షాన్‌ కావడం లేదా నెలలు నిండకుండా ప్రసవించడం వంటివి ఎక్కువగా సంభవిస్తాయని రిపోర్టు చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే నగరాల్లో నివసించే మహిళల్లో గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నాయన్న విషయంలో పరిశోధన నిర్వహిస్తే ఈ కాలుష్యం కారణంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుందని గర్భవతులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచుగా అబార్షన్లు కావాడానికి కాలుష్యమే కారణంగా కనిపిస్తుందని వారు చెబుతున్నారు.

Leave a comment