అబ్బాయి గా పుట్టి వుంటే బావుండేది అన్నది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఝెంగ్‌ క్విన్‌వెన్‌ ఓపెన్ టైటిల్ కోసం కోర్ట్ లో అడుగుపెట్టిన ఝెంగ్‌ కు నెలసరి నొప్పి మొదలైంది. మొదటి రౌండ్ లో ప్రత్యర్థిని మట్టి కరిపించిన ఝెంగ్‌ రెండో రౌండ్లో నెలసరి తో బలహీన పడింది. ఎంత ప్రయత్నం చేసినా ఈ శరీర కష్టాన్ని దాటలేక పోయాను అంటూ నెలసరి సమయంలో క్రీడాకారిణులు ఎదురుకొనే కష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నెలసరి ఆడపిల్లలకు సహజం. దాన్ని అర్థం చేసుకొని వారి కోసం ఒక్క నిమిషం ఆలోచించడం, కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం అవసరం అని తెలియజేస్తుంది ఈ ప్రకటన.

Leave a comment