నీహారికా,

నీకు సరదాగా ఒక రిపోర్ట్ సంగతి చెప్తా. చదువుతుంటే నవ్వొచింది కాని అది ఫ్యాక్ట్. నిజం అసలు భార్య భర్తల మద్య తగవులు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అన్న విషయంలో ఒక సర్వే చేసి మరి తెలుసుకొన్న రిపోర్ట్ ఏమిటంటే మీ భార్యలో ఎం చూసి మీరు పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్న అడిగితే 95 శాతం సర్వే లో పాల్గొన్న యువకులు అసలు సమాధానం చెప్పలేకపోయారట. అందానికి ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పారు కానేఎ ఆ అందం గురించి వాళ్లకు ఏమి తెలియదు. ఆమే అందం కోసం తీసుకొనే జాగ్రత్తలు గురించి కానీ, వాడే క్రీమ్ లు, సోప్ లు గురించి కానీ యువకులకు ఏమి తెలియదు. వాళ్ళ అవసరాల గురించి అవగాహన లేదు. పోనీ తెలుసుకొని వాళ్లకు అవసరమైనవి కొనిద్దామనే ఆలోచనకూడా అబ్బాయిలకు రాలేదని చెప్పారు. పైగా అంత టైం వేస్ట్ పనులు చేస్తారు అని ఆశ్చర్య పోయారట. ఇదొక్క పాయింట్ చాలదా, కొత్తగా పెళ్ళైన జంట మద్య అపార్థాలు వచ్చేందుకు కానీ చాలా ముక్యమైన పాయింట్ అనిపించేది ఇద్దరు చిన్నవాళ్ళే ఒకళ్ళ గురించి ఒకరికి అవగాహన లేని వాళ్ళే. జీవితం మొదలు  పెట్టిన మొదటి రోజు నుంచి ఇద్దరు ఎంతో సున్నితంగా వ్యవహరిస్తేనే లైఫ్ బాగుంటుంది. అందుకే ప్రతి విషయం డిస్కస్ చేసుకొని మరీ నిర్ణయం తీసుకోవాలి.

Leave a comment